ప్రధాన కారణం:
ఈరోజున కుటుంబాలు చిన్నవి కావటం, పెద్దవారు ఎక్కడో ఉంటున్నారు, పిల్లలు ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, కుటుంబ కలహాల రీత్యా విడిగా, దూరంగా వుంటున్నారు. అలాగే చదివే విద్యలో వృత్తికి సంబందించినదే కాని, మనస్సుకు సంబందించినది ఒక్క పుస్తకం కుడా పాఠాలలో లేదు.అంటే మనం చదువుతున్న చదువులో, విధానం లో ఏదో లోపం ఉంది, ఎందుకంటే సరాసరి ఒక వ్యక్తి 16 సంవత్సరాలు విద్య అబ్యసిస్తాడు, అంటే ఈ 16 సంవత్సరాలలో ఒక్క పుస్తకం కూడా మనస్సుకు సంబందించినది లేకపోవడం విచారకరం. అంతేగాక ఏ పనైనా చేయాలంటే, సాదించాలంటే మనస్సు మాత్రం కావాలి. మరి మనస్సుకు జ్ఞానాన్ని చెప్పే గురుకులాలు కనుమరుగయ్యాయి.కావున విలువలు, నైపుణ్యాలు నేర్పించే గురుకులాలు అవసరం అయినాయి. ఇప్పటి విద్యావిధానం లో విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య కొరవడింది. అది ఉద్యోగం చేయడానికి కావలిసిన నైపుణ్యాలు కావచ్చు, జీవితానికి సంబంధించినవి కావచ్చు. జీవితానికి, ఉద్యోగానికి కావలిసిన విలువలు, నైపుణ్యాల సమస్యను పరిష్కరించటంలో భాగంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు అయినది. అంటే సరియైన విద్య అందించటం, అది కూడా సులభంగా, ఉచితంగా, ఆకర్షణీయంగా అందాలి.
మేము ఎవరు:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా విలువలు,నైపుణ్యాలతో కూడిన విద్యను టెక్నాలజీ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా అందించటం, పరిశోధన చేయటానికి కావలిసిన వనరులు అందించటం. అంటే మన గురువులు అందించిన జ్ఞాన సంపదను ముందుతరాల వారికి అందించాలనే సంకల్పం కలిగిన కొందరు మిత్రులమి కలసి ఈ ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ను ఏర్పాటుచేసాము. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని ఉచిత సేవా సంస్థ. ఈ సేవ ఇంతకుముందు 2015 లో స్థాపించిన సాయి రామ్(Sairealattitudemanagement) ద్వారా అందిస్తూవుండేవారము, ఆ సేవను మరింత అభివృద్ధి చేయటంలో భాగంగా Free Gurukul Education Foundation ను హైదరాబాద్ లో జూన్ 2017 న స్థాపించాము.
ఏమి చేస్తాము:
మన సనాతన ధర్మ సంబంద సమాచారాన్ని, అలాగే విలువలు, నైపుణ్యాలకు సంబందించిన పుస్తకాలు,ఆడియోలు,వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో సేకరించి ఉచితంగా వెబ్సైటు, మొబైల్ ఆప్ ద్వారా అందిస్తాము.
మన లక్ష్యం :
ఉచిత గురుకుల విద్య ద్వారా, విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్యను, ఉచితంగా+ సులభంగా+ఆకర్షణీయంగా వెబ్సైటు, మొబైల్ ఆప్ ద్వారా అందించటం. అంటే సనాతన ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, ప్రవచనాలు, వ్యక్తిత్వవికాసం, విలువలు,ధర్మాలు,నైపుణ్యాలకు సంబందించిన PDF,Audio,Video,Image లు అందించటం.తద్వారా ధర్మం,నైపుణ్యాల,విలువల గురించి పరిశోధన చేయలనుకొనేవారికి కావలసిన వనరులు అందుబాటులో ఉంచటం. దీనివల్ల తెలుగువారు నేర్చుకొని వారి జీవితంలో మంచి విలువలు,నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలరు.
మన ప్రత్యేకత:
మన పద్దతి ఏమనగా టెక్నాలజీ ఉపయోగించి వెబ్సైటు, అప్ ద్వారా సులభంగా,ఉచితంగా, ఆకర్షణీయంగా అందరికి అందుబాటులో ఉండేలా PDF,Audio,Video,Image లు అందించటం. అంటే ఇప్పటి తరానికి తగినవిధంగా డిజైన్ చేయటం, పబ్లిసిటీ చేయటం.
ఈ ప్రాజెక్ట్ వెనుక కారకులు:
ఉచిత గురుకుల విద్య అందించాలనే తపన కలిగిన మిత్రులము ఒకరికొకరు కలిసి మాట్లాడుకొంటూ, తగిన నిర్ణయాలు తీసుకొంటూ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్తున్నాము.
ఫౌండేషన్ కమిటీ సబ్యులు:
శిష్ట్లా సత్యనారాయణ - ప్రెసిడెంట్
కోమిరెడ్డి రాజా రమేష్ రెడ్డి - సెక్రెటరీ
నిచ్చెనమెట్ల పద్మనాభయ్య - ట్రెజరర్
గుడిపాటి లక్ష్మినారాయణ - కమిటీ సబ్యులు
వరికుంట్ల మోహన్ సాయి - కమిటీ సబ్యులు
చిల్లర వెంకట రామకృష్ణ - కమిటీ సబ్యులు
బొల్లినేని రవి - కమిటీ సబ్యులు
మన ప్రయాణం:
1st Dec 2021 - Online Classes సేవ ప్రారంభం అయినది.
1st Sep 2021 - "నీ కష్టం(దుఃఖం) ఇంతకంటే పెద్దదా?" సేవ ప్రారంభం అయినది
1st July 2021 - త్యాగం,సేవ,మానవత్వం ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్న మహానుభావులు(దేవుళ్ళు), పేదరికంతో పోరాడుతూ సాధించిన విజయాలు సేవ ప్రారంభం అయినది
5th Mar 2021 - ప్రేరణ, స్ఫూర్తినిచ్చే చిత్రాలు(Inspirational Pictures) సేవ ప్రారంభం అయినది
6th Sep 2020 - నన్ను నేను తెలుసుకోవటం ఎలా? (ఆత్మ జ్ఞానం, ఆత్మ విద్య), భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే?(ఒకరినొకరు అర్ధం చేసుకోవటం ఎలా?) అనే సేవలు ప్రారంభించబడినవి.
30th Apr 2020 - 3500 పుస్తకాల లింక్స్ కలిగిన pdf సేవ ప్రారంభించాము. ఇందులో అన్నీ పుస్తకాల లింక్స్ ఉంటాయి. ఈ pdf పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
4th Apr 2020 - iOS మొబైల్ ఆప్ విడుదల అయినది. Gurukul Education అనే పేరుతో App Store లో లభ్యం అగును.
27 జూలై 2018 - WhatsApp Broadcast Group విభాగం ప్రారంభించినాము, ప్రతి రోజు ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక, సామాజిక విషయాలు సంబంధ 5 లేక 6 పోస్ట్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. జాయిన్ అగుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
18 మే 2018 - ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అయినది. రిజిస్ట్రేషన్ నెంబర్: 315/2018
18 ఏప్రిల్ 2018 - IMPACT Personality Development విభాగం ప్రారంభించినాము.
6 ఏప్రిల్ 2018 - సామాజిక అవగాహన విభాగం ప్రారంభించినాము.
8 జనవరి 2018 - పిల్లలు విభాగం ప్రారంభించాము
23 నవంబర్ 2017 - వీడియో ప్రవచనాలు, ఆడియో ప్రవచనాలు, మైండ్ మేనేజ్మెంట్ విభాగాలను వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా విడుదలచేసాము.
15 ఆగష్టు 2017 - Free Gurukul Education ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి www.freegurukul.org వెబ్సైటు ద్వారా, FreeGurukul Android మొబైల్ ఆప్ సేవలు ప్రారంభంలో బాగంగా మొదట పుస్తకాలు విడుదల చేసాము.
జూలై 2016 -- 3500 Free Telugu Bhakti Books ఆండ్రాయిడ్ ఆప్ ప్రారంభించాము. ఇప్పటివరకు 50000 మంది చదువుకొంటున్నారు.
జూలై 2016 -- పెన్ డ్రైవ్ సేవ అందించటం, ఇప్పటివరకు 365 మందికి 32gb pen drive ద్వారా పుస్తకాలను కాపీ చేసి ఇచ్చాము.
అక్టోబర్ 2015 -- https://telugubhakthivideos.blogspot.com website ద్వారా ఒక లక్ష మంది పైగా వీడియో ప్రవచనాలు చూసారు..
మార్చ్ 2015 -- https://sites.google.com/site/sairealattitudemanagement/ ద్వారా 3500 పుస్తకాలు ఉచితంగా అందించటం. దీనిద్వారా 57 వేలకు పైగా వెబ్సైటు వచ్చి చుదువుకొంటున్నారు..
మన గమ్యం:
విలువలు,నైపుణ్యాలతో కూడిన విద్య అందరికి ఉచితంగా + సులభంగా అందుబాటులో + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందింపబడాలి.
అంకితం: సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు